« యేసుతో ఠీవిగాను - అడ్డుగా వచ్చువైరి గెల్వను
Yesutho teeviganu podhama
share with whatsapp

పల్లవి:
యేసుతో ఠీవిగాను - అడ్డుగా వచ్చువైరి గెల్వను   
యుద్ధ నాదంబుతో బోదము   
...యేసుతో...
1.
రారాజు సైన్యమందు చేరను - ఆ రాజు దివ్యసేవ చేయను    (2X)
యేసు రాజు ముందుగా - ధ్వజము బట్టి నడువగా    (2X)
యేసుతో ఠీవిగాను వెడలను   
...యేసుతో...
2.
విశ్వాస కవచమున్ ధరించుచు - ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు    (2X)
అనుదినంబు శక్తిని - బొందుచున్న వారమై    (2X)
యేసుతో ఠీవిగాను వెడలను   
...యేసుతో...
3.
శోధనలు మనల చుట్టి వచ్చినా - సాతాను అంబులెన్ని తగిలినా    (2X)
భయములేదు మనకిక - ప్రభువు చెంత నుందుము    (2X)
యేసుతో ఠీవిగాను వెడలను   
...యేసుతో...
4.
ఓ యువతి యువకులార చేరుడీ - శ్రీ యేసురాజు వార్త చాటుడి    (2X)
లోకమంత ఏకమై - యేసునాధు గెల్వను    (2X)
సాధనంబేవరు నీవు నేనెగా   
...యేసుతో...