« రాకడ సమయంలో
Rakada samayamlo
share with whatsapp

పల్లవి:
రాకడ సమయంలో - కడబూర శబ్ధంతో   
యేసుని చేరుకునే - విశ్వాసం నీకుందా?   
రావయ్య యేసయ్య - వేగరావయ్యా   
రావయ్య యేసునాధా - వేగమెరావయ్యా   
1.
యేసయ్య రాకడ సమయంలో - ఎదురేగె రక్షణ నీకుందా?   
లోకాశలపై విజయం నీకుందా?   
...రాకడ...
2.
ఇంపైన ధూపవేదికగా - ఏకాంత ప్రార్థన నీకుందా?   
యేసు ఆశించే దీనమనసు నీకుందా?   
...రాకడ...
3.
దినమంతా దేవుని సన్నధిలో - వాక్యం కొరకు ఆకలి   
నీకుందా? - యేసునాధునితో సహవాసం నీకుందా?   
...రాకడ...
4.
శ్రమలోన సహనం నీకుందా? స్తుతియించె నాలుక   
నీకుందా? ఆత్మలకొరకైన భారం నీకుందా?   
...రాకడ...
5.
నీ పాతరోత జీవితము - నీ పాప హృదయం మారిందా?   
నూతన హృదయంతో -ఆరాధన నీకుందా?   
...రాకడ...
6.
అన్నీటికన్నా మిన్నగను - కన్నీటి ప్రార్ధన నీకుందా?   
ఎల్లవేళలలో - స్తుతియాగం నీకుందా?   
...రాకడ...