| పల్లవి: |
| నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ (2X) |
| నీ వాక్యమును నేర్పించుము దానియందు నడచునట్లు నీతో |
| ...నీ స్వరము... |
| 1. |
| ఉదయముననే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము |
| దినమంతటి కొరకు నను ||సిద్దపరచు ఆపదల నుండి|| |
| ...నీ స్వరము... |
| 2. |
| నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు సరి జేసుకొందు |
| నీ మార్గములో నడచునట్లుగా ||నేర్పించుము ఎల్లప్పుడు|| |
| ...నీ స్వరము... |
| 3. |
| భయ భీతులతో తుఫానులలో నీ స్వరము వినిపించుము |
| అభయమూ నిమ్మూ ఓ గొప్ప దేవా ||ధైర్యపరచుము నన్ను|| |
| ...నీ స్వరము... |
| నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కొరకే |
| నీతో మనుజులతో సరిజేసుకొందు ||నీ దివ్య వాక్యము ద్వారా|| |
| ...నీ స్వరము... |
