| పల్లవి: |
| చేయి పట్టుకో నా చేయి పట్టుకో |
| నే జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో (2X) |
| 1. |
| కృంగిన వేళ ఓదార్పు నీవేగా నను ధైర్యపరచు నా తోడు నీవేగా (2X) |
| మరువగలనా నీ మధుర ప్రేమను (2X) |
| యేసు నా జీవితాంతము (2X) |
| ...చేయి... |
| 2. |
| లోక సంధ్రము నా పై ఎగసినా విశ్వాస నావలో కలవరమే రేగినా (2X) |
| నిలువా గలనా ఓ నిమిషమైననూ (2X) |
| యేసు నా చేయి విడచినా (2X) |
| ...చేయి... |
| 3. |
| శోధన బాధల్ ఎన్నెన్నో కలిగినా విశ్వాస నావలో కలకలమే రేగినా (2X) |
| విడువగలనా ఓ నిమిషమైననూ (2X) |
| యేసు నా జీవితాంతము (2X) |
| ...చేయి... |
